Starlink Link India: భారత్‌లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!
- త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు..
- తాజాగా భారతీ ఎయిర్టెల్, జియో ప్లాట్ ఫార్మ్స్ SpaceX తో ఒప్పందాలు.
- అధిక ధర, స్పెక్ట్రం అనుమతుల సమస్యలు
- మరి భారత్ లో విజయం సాధించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Starlink Link India: భారత మార్కెట్లో SpaceX సంస్థకు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బాండ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి విధితమే. అయితే, దీని అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం కష్టంగానే కనపడుతుంది. స్టార్ లింక్ (Starlink) సేవలు ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ లాంటి ప్రముఖ బ్రాడ్‌బాండ్ సేవల కంటే 10 నుండి 14 రెట్లు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తక్కువ భూమి కక్ష్య (LEO) ఉపగ్రహాల ద్వారా అందించే ఈ ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా తక్కువ ధరకు అందడం కష్టమే.
Read Also: KL Rahul: కెఎల్ రాహుల్‌ను ‘మిస్టర్ ఫిక్సిట్’గా ప్రశంసించిన ఆసీస్ ప్లేయర్
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
కొన్ని నివేదికల ప్రకారం, స్టార్ లింక్ సేవలు కేవలం ప్రీమియం సర్వీసుగానే కొనసాగుతుందని అంచనా వేసాయి. అంతేకాకుండా, స్టార్ లింక్ వినియోగదారులకు అవసరమైన ఇన్‌స్టలేషన్‌కు ఖర్చు దాదాపు రూ.16,000 పైగా ఉండడంపై మరింత ప్రభావం చూపనుంది. అయితే స్టార్ లింక్ 200-250 Mbps వేగాన్ని అందించే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో సేవల విస్తరణలో కెపాసిటీ పరిమితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం 5G విస్తృతంగా పెరుగుతున్న కారణంగా స్టార్ లింక్ సేవలు కేవలం కొందరికి మాత్రమే పరిమితం అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే తాజాగా భారతీ ఎయిర్టెల్, జియో ప్లాట్ ఫార్మ్స్ SpaceX తో కలిసి స్టార్ లింక్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అధిక వేగం బ్రాడ్ బ్యాండ్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జియో తన జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ కు అనుగుణంగా స్టార్ లింక్ సేవలను ఉపయోగించాలనుకుంటుంది. అయితే, స్టార్ లింక్ సేవలకు సంబంధించి ఇప్పటివరకు భారత ప్రభుత్వ అనుమతులు, స్పెక్ట్రం లైసెన్సులు పొందలేదు. అందువల్ల ఇది పూర్తి స్థాయిలో మొదలవ్వడానికి ఆలస్యమయ్యే అవకాశముంది.
Read Also: CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…
దీన్ని మొత్తంగా చూస్తే.. స్టార్ లింక్ సేవలు భారత్‌లో అధిక ధర, స్పెక్ట్రం అనుమతుల సమస్యలు, ఫైబర్ విస్తరణ వంటి అంశాలు దీనిని సాధారణ వినియోగదారులకు అందని ద్రాక్షగా మార్చవచ్చు. అయితే వ్యాపార అవసరాలు, దూరప్రాంతాల కనెక్టివిటీ, SME వినియోగదారులకు మాత్రం ఇది ప్రత్యేకమైన పరిష్కారంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!