సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను ఈనెల 10న అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భారీ ఎత్తున ఈ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.. ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ పి.జగదీష్..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి..
తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది.. తాడిపత్రి లో ఇసుక అక్రమ రవాణా వివాదం రాష్ట్రస్థాయిలో హీట్ ను రాజేసిన విషయం విదితమే కాగా.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పలుమార్లు సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.