దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం మేరకు దక్షిణ కొరియా పోలీసులు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అనూహ్యంగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించి గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.
నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. బుధవారం రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. ఇక గురువారం సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి వరించింది. చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది.
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సేఫ్ గా ల్యాండింగ్ చేసేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన తొలి శాటిలైట్, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు.
దక్షిణ కొరియా నటి జంగ్ చై-యుల్ మృతి చెందింది. అపార్టమెంట్ లోని నటి ఇంట్లో శవమై కనిపించింది. ఆమె వయసు 26 సంవత్సరాలు. అయితే ఆమె మరణానికి కారణం ఇంకా తెలియలేదు. ఆమె అంత్యక్రియలు ఆమె కుటుంబ సభ్యుల కోరికలకు అనుగుణంగా ప్రైవేట్‌గా నిర్వహిస్తారని తెలుస్తోంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ జీబ్రా హల్ చల్ చేసింది. జంతుప్రదర్శనశాల నుండి గురువారం తప్పించుకున్న జీబ్రా మూడు గంటలపాటు సియోల్‌లోని పలు వీధుల్లో తిరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.