Pakistan Navy Warship PNS Saif Visits Bangladesh: గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. పాకిస్థాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక, PNF SAIF, నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుందని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.
Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర…
PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది.
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి…
Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది.
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…