IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ…
South Africa: రాంచీలో నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ మిల్లర్ కుమార్తె శనివారం నాడు మృతి చెందింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘రిప్ మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయితే…
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో కీలక ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేల నుంచి అతడు తప్పుకున్నాడు.…
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 2015 నుంచి ఇప్పటివరకు భారత్‌లో దక్షిణాఫ్రికా నాలుగు సార్లు టీ20 సిరీస్ ఆడింది. తొలి సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. రెండు, మూడు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. తొలి సిరీస్‌కు ధోనీ, రెండో సిరీస్‌కు కోహ్లీ, మూడో సిరీస్‌కు పంత్ నాయకత్వం వహించారు. ఇప్పుడు నాలుగో సిరీస్‌లో మాత్రం టీమిండియా…
IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే…
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు,…