బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.