బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ…
Sourav Ganguly: బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణ ఖరారైంది. గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శిగానే…
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం అన్ని రాష్ట్ర సంఘాలకు తెలిపారు. 2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్‌పై ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గంగూలీ అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని…
Legends League Cricket 2022: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలోకి బరిలో దిగనున్నారు. వయసు మీద పడ్డా ఉత్సాహంతో క్రికెట్ ఆడి అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) రెండో సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఈ టోర్నీ ఐదు నగరాల్లో జరగనుంది. లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ఢిల్లీ, కటక్, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. . ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్ 16న…