బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్ గురించి మాట్లాడుతూ చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చి, ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత ధైర్యంగా పోరాడి బయటపడిన సోనాలి, ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రకృతి వైద్యం తన రికవరీ జర్నీలో సపోర్ట్ అయిందని చెప్పిన ఆ వ్యాఖ్యలు కొంతమంది వైద్యులను ఆగ్రహానికి గురి చేశాయి. “ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుంది అన్నదానికి ఎలాంటి…