బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్ గురించి మాట్లాడుతూ చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చి, ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత ధైర్యంగా పోరాడి బయటపడిన సోనాలి, ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రకృతి వైద్యం తన రికవరీ జర్నీలో సపోర్ట్ అయిందని చెప్పిన ఆ వ్యాఖ్యలు కొంతమంది వైద్యులను ఆగ్రహానికి గురి చేశాయి. “ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుంది అన్నదానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని వారు విమర్శలు చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం అయింది. దీని వల్ల సోనాలి చెప్పిన మాటల పై అర్థం తప్పుగా తీసుకుంటున్నారనే భావన కలిగి, వెంటనే తన వ్యాఖ్యలను క్లారిఫై చేస్తూ ఒక నోటు పెట్టారు.
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్..
తాను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఉద్దేశ్యం లేదని సోనాలి స్పష్టం చేశారు. “నేను మోసగత్తెను కాదు నేను క్యాన్సర్ బాధ తెలిసిన మనిషిని” అని ఆమె స్పష్టంగా చెప్పింది. తన అనుభవం, తనకు పనిచేసిన విధానం మాత్రమే పంచుకున్నానని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పలేదని అన్నారు. ప్రతి క్యాన్సర్ వేరు, ప్రతి ఒక్కరి చికిత్స విధానం వేరు అని మరోసారి గుర్తు చేశారు. క్యాన్సర్‌తో పోరాడినప్పుడు ఎదురైన భయం, నొప్పి, మానసిక బాధలు అన్నిటినీ నిజాయితీగా పంచుకోవడమే తన ఉద్దేశం అని తెలిపింది. క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత సోనాలి ఎప్పుడూ ధైర్యం, ఆశ అనే సందేశాలు ఇస్తూ ఉంటుంది. తన జర్నీతో చాలా మందికి స్పూర్తినిస్తోందనే విషయం మాత్రం నిజమే.