Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇదే సమయంలో మన సైనికులు కూడా చాలా మంది వీరమరణం పొందారు. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఆర్మీ సైనికులు కూడా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. రహస్య సమాచారం ఆధారంగా…
కంబోడియాలో పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 20 మంది సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని కంబోడియా ప్రధాని హున్ మానెట్ తెలిపారు. కంపాంగ్ స్పీ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంలో జరిగిన పేలుడు గురించి తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మానెట్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.