Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు.