క్రమంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది… ప్రతీ వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో డేటా ఉండడంతో.. అంతా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను లైక్‌లు, షేర్లతో ముంచెత్తుతున్నారు.. కొన్నిసార్లు.. అది తప్పుడు సమాచారం అయినా.. ఎక్కువ మంది షేర్ చేస్తూ పోతున్నారు.. అది ఫేక్ అని తెలిసే లోపే జరాగాల్సిన నష్టం జరిగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేవారు.. తప్పుడు సమాచారంతో…
విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. ఓ ఎంపీ పైలట్‌గా మారి విమానాన్ని గాల్లో ఎగిరిస్తే.. మరో ఎంపీ ప్రయాణికుడికిగా అతడితో పాటు ప్రయాణం చేశారు.. అయితే, ఇద్దరూ సుపరిచితులు కావడంతో.. వారి పలకరింపులు, ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యానికి గురికావడం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ అరుదైన ఘటన అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ…
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా జనసంచారం తక్కువగా ఉండటంతో పాటుగా, కాలుష్యం కొంతమేర తగ్గిపోవడంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారుల వెంట ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. Read: ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం…
సోషల్ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట…
మేకలు ఆకులు మాత్రమే తింటాయి అన్నది పాత మాట. ఈ మేక వెరీ స్పెషల్. ఇది ఆకులనే కాకుండా చేపలను కూడా లాగించేస్తోంది. ప్లేటులో ఉంచిన చేపలను కరకర నమిలి మింగేసింది. ఆకులు తినితిని బోర్ కొట్టిందేమో ఇలా చేపలను తింటోంది ఆ మేక. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఒక్కసారిగా వైరల్ అయింది. ఆకులు అలమలు తినే మేకలోనే అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటే, చేపలను తినే మేకలో ఇంకెన్ని…
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమిర్‌ఖాన్.. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ వర్గం వారిచ్చిన స్టేట్మెంట్స్ తో అర్థంచేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్‌గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని,…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. దళిత అవేదన దీక్ష తర్వాత కలిసిన కాంగ్రెస్ నేతలు.. నిన్న సీఎం తో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అవ్వడం పై మాట్లాడుతూ… దీని పై సోషల్ మీడియా లో తప్పుగా ట్రోల్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం పై జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్యలు సీఎం కి కాకుంటే ఇంకా ఎవరికి చెప్తాం అని అన్నారు. మేము కలిసింది…
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ…