Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. వర్మతో చేరిన తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా తయారయ్యాడా? లేక ముందు నుంచి ఈయన ఇంతేనా అనేది మాత్రం అర్థం కావడం లేదు. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య కాలంలో నోరు అదుపులో పెట్టుకోవడం లేదు. వాడే భాష కూడా సరిగ్గా ఉండడం లేదు. రివ్యూయర్లు నెగెటివ్‌గా రాస్తారని మేకర్లు, నటీనటులు అప్పుడప్పుడు కౌంటర్లు వేయడం సహజం. ఎంతో కష్టపడి తీసిన సినిమాకు నెగెటివ్ రివ్యూలు వస్తే బాధపడతారు. అది కూడా నిజమే..
Read Also:UK: లండన్‌లో ఇండియన్స్ VS ఖలిస్తానీలు.. రాయబార కార్యాలయం ముందు ఉద్రిక్తత..
కానీ తమ సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని బండ బూతులు తిట్టడం, నీచంగా మాట్లాడడం ఏ మాత్రం తగదు. గతంలో పొట్టేలు సినిమా టైంలో శ్రీకాంత్ అయ్యంగార్ వాడిన పదజాలం విన్న ప్రతి ఒక్కరికీ అసహ్యంగా అనిపించింది. అసలు ఆయన స్పృహలోనే ఉండి మాట్లాడాడా? అన్న అనుమానం కలిగింది. సోషల్ మీడియాలో కూడా ఆయనపై బాగా ట్రోలింగ్ కూడా అయింది. మరోసారి రాచరికం సినిమా ఈవెంటులో మరో సారి రివ్యూవర్స్ పై రెచ్చిపోయి మాట్లాడారు. రేటింగ్ ఇచ్చే వాళ్ల జీ పే నంబర్లు పంపిస్తే డబ్బులు పంపిస్తానంటూ దారుణంగా కించ పరిచాడు.
Read Also:Minister Savita: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక
ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆర్టిస్టుగా పర్వాలేదనిపించే శ్రీకాంత్ అయ్యంగార్.. ఇలా వ్యక్తిగతంగా ఇలాంటి మాటలతో దిగ జారిపోతోన్నట్లుగా అనిపిస్తుంది. రాచరికం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొని రివ్యూయర్ల మీద మండి పడ్డాడు. వస్తూ వస్తూనే గతంలో రివ్యూవర్లపై కొంచమే ఇచ్చాను.. గట్టిగా ఈ సారి ఇవ్వాలని డిసైడ్ అయ్యానంటూ స్పీచ్ మొదలు పెట్టారు. అనంతరం బెదురలంక సినిమాలో ఓ డైలాగ్ చెప్పి రివ్యూవర్లను చిన్న చూపుగా మాట్లాడారు. ఓ పక్క ప్రేక్షక దేవుళ్లకు సాష్టంగ నమస్కారం అంటూనే మరో పక్క వీళ్ల పై ఆడిపోసుకున్నారు. రివ్యూవర్లను ఎంకరేజ్ చేయవద్దంటూ కోరారు.