Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది.
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో…
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే…
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
Dhanush : కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
ఆన్‌లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ టీషర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను, భర్తను విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది. ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వివాహం ఆ మహిళ భర్త చేతుల మీదుగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Dead Body On Bicycle: తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల…