Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ధనుష్.. తాజాగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. ఇది కూడా అందరి చూపును కట్టిపడేస్తోంది. సెన్సిటివ్ సినిమాల డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్ కూడా ఆలోచింపజేస్తోంది.
Read Also : Baahubali : బాహుబలిని ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?
ధనుష్ 54 టైటిల్ తో రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో పత్తిపంట కాలిపోతుండగా.. ఆ పంటవైపు దీనంగా చూస్తున్నాడు ధనుష్. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సారి రైతుల కష్టాలను వివరించే సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ ఏది చేసినా ప్రయోగమే అని ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా హీరో పాత్ర కంటే కథకే ప్రియారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అని అర్థం అవుతోంది. ఇందులో రైతుల కష్టాలు, గ్రామాల్లో ఉండే పెద్ద మనుషుల ఆగడాలను చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎవరూ చేయని పాత్రలో ధనుష్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతి సినిమాతో మెస్మరైజ్ చేస్తున్న ధనుష్.. ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అంతా వెయిట్ చేస్తున్నారు.
Read Also : AlluArjun-Atlee : బన్నీ-అట్లీ మూవీ.. విలన్ ఎవరో తెలుసా..?