నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం అని, దానిని (నిద్రించే హక్కు) ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే, దేరే, మంజుషా దేశ్ పాండేలతో కూడిన ధర్మాసనం ఈడీపై మండిపడింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్ కొతుమల్ ఇస్రానీ (64)ని ఈడీ అరెస్టు చేసింది.…