స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.