స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంకల్పంతో పని చేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన తెలిపారు.
చంద్రబాబు ఆదేశాల తోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు స్కిల్ తో చేసిన స్కామ్ లు పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా? అంటూ మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. వాచ్ లేని చంద్రబాబు కోట్ల రూపాయలతో లాయర్లను ఎలా పెట్టుకున్నాడు అంటూ ఆయన అడిగారు.