ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద కారు లారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు బాపట్ల మండలం స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహానందికి వెళ్ళి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.…
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉత్తరాఖాండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని ఓఖల్‌కండ బ్లాక్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో హల్ద్వానీ నుంచి ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి వెళ్తున్న మ్యాక్స్ వాహనం పాట్లోట్ సమీపంలో 200 అడుగుల లోతులో పడిపోయింది.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్‌పట్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ వాహనంపై అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.