Road Accident: ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లె మండలం చిన్న వరంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. తిరుపతి నుండి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును చిన్న వారంపాడు వద్ద చెన్నై వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఇక, ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు.. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లె పోలీసులు.. హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..