Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Sivarapalli Fame Rag Mayur Exclusive Interview

Rag Mayur: ఒకే రోజు విలన్‌గా, హీరోగా.. స్టేట్ టాపర్ టు లీడ్ యాక్టర్: రాగ్ మయూర్ ఇంటర్వ్యూ

Published Date :January 30, 2025 , 5:43 pm
By Bhargav Chaganti
Rag Mayur: ఒకే రోజు విలన్‌గా, హీరోగా.. స్టేట్ టాపర్ టు లీడ్ యాక్టర్: రాగ్ మయూర్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాగ్ మయూర్ అంటే గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ మరిడేష్ బాబు అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు అతన్ని. హైదరాబాదులో పుట్టి పెరిగి సినీ రంగం మీద ఆసక్తితో కొన్నాళ్లు సినిమాలతో పాటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు రాగ్ మయూర్. ఈనెల 24వ తేదీన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గాంధీ తాత చెట్టు సినిమాతో, మరోపక్క లీడ్ రోల్లో సివరపల్లి అనే ఒక వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇలాంటి అరుదైన అవకాశం చాలా తక్కువ మంది నటులకు మాత్రమే లభిస్తుంది. ఈ రెండు పాత్రలతో మంచి పేరు సంపాదించుకున్న రాగ్ మయూర్ ని ఎన్టీవీ వెబ్ టీం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు మీకోసం.

ప్ర. అమెరికాలో మాస్టర్స్ చేసిన మీకు అసలు సినిమా మీద ఆసక్తి ఎలా ఏర్పడింది?
స. నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది. మా నాన్న చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అందుకే కేవలం సమ్మర్ హాలిడేస్ లో మాత్రమే కేబుల్ టీవీ పెట్టించేవారు. ఏడాది మొత్తం ఉన్న సినిమా ఆకలిని సమ్మర్ హాలిడేస్ లో తీర్చుకునేవారం. ఆ సినిమా పిచ్చి అలా కంటిన్యూ అయింది. ఆ సినిమా మీద అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం అప్పట్లో బ్లాగింగ్ చేసేవాడిని. అది చూసి ఒక ప్రముఖ సైట్ నన్ను రివ్యూలు రాయమని అడిగింది. మరోపక్క చిన్నప్పటి నుంచి సినిమాతో పాటు నటన మీద కూడా పిచ్చి ఉండేది. స్కూల్లో చదువు విషయంలో మాత్రం ముందే ఉండేవాడిని. టాప్ త్రీ ప్లేసుల్లోనే ఉండేవాణ్ణి. ఇంజనీరింగ్ లో కూడా స్టేట్ ర్యాంకర్ ని. ఒకపక్క చదువుకి ఇబ్బంది లేకుండానే మరోపక్క నటన మీద కూడా నేను చేయాల్సిన హోంవర్క్ చేసుకునేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజనీరింగ్, మాస్టర్స్ సమయంలో కాస్త చదువు మీద ఫోకస్ పెట్టినా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాకు నటన మీద పూర్తిస్థాయిలో టైం కేటాయించే అవకాశం దక్కింది. థియేటర్ వర్క్ షాప్స్ కి వెళ్లి చాలా విషయాలను నేర్చుకున్నా.

Also Read

  • Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
  • Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
  • Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

ప్ర. మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
సినిమా బండికి ముందు డెమో ఫిలిం ఒకటి చేశారు. దానికి ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. అది రాజ్ -డీకే చూసి డెమో ఫిలిం చేసిన వాళ్లే రియల్ ఫిలిం కూడా చేయాలని కోరడంతో నాకు ఆ సినిమా చేసే అవకాశం దక్కింది.

ప్ర. అమెరికా వెళ్లి మాస్టర్స్ చేసినా సరే అక్కడ ఆగిపోకుండా ఇండియా వచ్చి సినిమాలు ప్రయత్నించడానికి కారణం?.
స. నేను కొంచెం హోమ్లీ పర్సన్. చదువు కోసం అక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ చదువు పూర్తి చేసుకుని ఇండియా రావాలా అని అనుకునేవాడిని. నిజానికి నాకు అక్కడ పెద్దగా ఖర్చు కాలేదు. నేను బాగా చదివాను, నాకు స్కాలర్షిప్ వచ్చేది, స్టైఫండ్ వచ్చేది. అయినా ఎందుకో అక్కడ ఉండిపోవాలని ఆలోచన రాలేదు. ఇక్కడికి వచ్చాక ఉద్యోగం చేస్తూ నటన మీద నాకు ఉన్న ప్యాషన్ తో ప్రయత్నాలు చేసేవాడిని.

ప్ర. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారా?
స.  లేదండి, ఒకపక్క సినిమాలు మరో పక్క ఉద్యోగం మేనేజ్ చేయడం కొంచెం కష్టమే. అయితే కీడా కోలా సినిమా వరకు జాబ్ చేసేవాడిని. సినిమా బండి నుంచి కీడా కోలా వరకు మూడేళ్ల సమయం కష్టంగానే రెండింటిని మేనేజ్ చేశాను. కీ డాకోల రిలీజ్ అయిన తర్వాత మంచి కంటెంట్ సినిమాలో వస్తాయని నమ్మకంతో జాబ్ రిజైన్ చేశాను. నిజానికి మనం సినిమాలను ఎంచుకోలేము, సినిమాలే మనల్ని ఎంచుకుంటాయని నమ్ముతాను. ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, మన కోసం కథలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో నేను ఇంకా జాబ్ చేసుకుంటూ ఉండటం కరెక్ట్ కాదని ఉద్దేశంతో తెగించి బయటకు వచ్చేసాను.

ప్ర. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఉంటారు.. ఎందుకు ఇదంతా జాబ్ చేసుకుంటే బాగుండేది అని ఇప్పుడేనా అనిపించిందా?
స.  అనిపించింది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.. ఎందుకంటే మన సినీ పరిశ్రమ ఆర్గనైజ్డ్ పరిశ్రమ కాదు. నేను కార్పొరేట్ రంగంలో పనిచేసే వచ్చాను. అక్కడ మనకు ఇచ్చే డబ్బులు కానివ్వండి మనతో మాట్లాడే మాటలు కానివ్వండి అన్ని డాక్యుమెంటెడ్ గా ఉంటాయి. శాలరీ కూడా డేట్ కి పడిపోతుంది. కానీ ఇండస్ట్రీలో సడన్గా మనకి చెప్పిన షూటింగ్ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఇస్తానన్న పేమెంట్ ఇవ్వకపోవచ్చు. మనమే దాన్ని ఫాలోఅప్ చేసి తీసుకోవాలి. జాబ్లో అయితే వాళ్లే మన చేసిన పనికి నెలవారి డబ్బులు వేసేస్తారు. కానీ ఒక మంచి సినిమా చేసినప్పుడు చూసిన ప్రేక్షకులు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఈ కష్టాలన్నింటినీ లైట్ తీసుకునేలా చేస్తాయి.

ప్ర. మీ మొదటి సినిమా నుంచి చూసుకుంటే మొన్న వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ వరకు అన్ని భిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చారు.అదెలా సాధ్యమైవుతోంది?
స.  నేను కథలు చాలా జాగ్రత్తగా విని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టే మంచి సినిమాలు చేయగలుగుతున్నాను. నాకు మొదటి సినిమాలోనే మరిడేష్ బాబు అనే క్యారెక్టర్ తో మంచి పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది కదా అని నా దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలు చేసుకుంటూ వెళితే ఈరోజు నన్ను మీరు ఇంటర్వ్యూకి పిలిచేవారు కాదేమో.. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టే ఆడియన్స్ నన్ను చూసినప్పుడు వీడు భలే చేస్తున్నాడు రా అని ఫీల్ అవుతున్నారు.

ప్ర. ఒకే రోజున మీరు నెగిటివ్ షెడ్ లో చేసిన సినిమా, లీడ్ రోల్ లో చేసిన వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి రెండిటికీ మంచి పేరు వచ్చాయి ఎలా ఫీలవుతున్నారు?

స. ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన ఒక నటుడికి తన సినిమా రిలీజ్ అవ్వడమే పెద్ద అచీవ్మెంట్. అలాంటిది నాకు ఒకేరోజు పండగ లాగా రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఒకదానిలో విలన్ గా మరొక దానిలో లీడ్ రోల్ లో చేయడం చాలా ఆనందం కలిగిస్తోంది.. ఒకే రోజు నన్ను ఆడియన్స్ రెండు భిన్నమైన పాత్రలలో చూస్తున్నారు. ఇది రా వీడి స్టైల్ అని ఆడియన్స్ అనుకునేలా చేశా అని నేను ఫీల్ అవుతున్నాను. మా సినిమా చూసి మహేష్ బాబు రామ్ చరణ్ వంటి వారు స్పందించడం ఇంకా ఆనందం కలిగిస్తోంది.

ప్ర. గాంధీ తాత చెట్టు షూటింగ్ లో ఎప్పుడైనా సుకుమార్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికిందా?
స.  మామూలుగా సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాలు చాలా డౌటు ఎర్త్ ఉంటాయి అని వినేవాడిని కానీ సుకుమార్ బండ్రెడ్డి ఫ్యామిలీ చూసిన తర్వాత వీళ్ళు నిజమైన డౌన్ టు ఎర్త్ అనే పదానికి నిర్వచనం అనిపించింది. నాకు సుకృతి, తబిత, సుకుమార్ ముగ్గురితో మాట్లాడే అవకాశం దొరికింది. ఒకరోజు తబిత గారి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ లో మా షూట్ జరుగుతున్న లోకేషన్ కి సుకుమార్ వచ్చారు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అది అయిన తర్వాత అప్పటివరకు జరిగిన రషెస్ చూస్తూ ఒక సీన్లో నేను నడిచిన మేనరిజం ఆయన నడిచి చూపించారు. నేను చేసిన విషయమే మర్చిపోయాను కానీ ఆయన ఆ చిన్న మేనరిజం కూడా గుర్తుపెట్టుకుని నడిచి చూపించి మరి అప్రిషియేట్ చేయడం నాకు చాలా స్పెషల్. అలాగే డైరెక్టర్స్ స్పెషల్ షో ఒకటి వేశారు అందులో కూడా ఆయన అప్రిషియేట్ చేశారు అలాగే సివరపల్లి కూడా మా ఇంట్లో చూడడం మొదలుపెట్టారు అని చెప్పడం ఇంకా ఆనందం కలిగించింది.

ప్ర. మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? రాబోయే 10 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి అనుకుంటున్నారు?
స.  నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు ఎందుకంటే ఒక రోల్ కి ఫిక్స్ అయిపోతే ఆకలి తీరిపోతుందేమో అని కు ఫీలింగ్. నా ఆకలి తీరకూడదు, నా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఇదేనా ముఖ్య ఉద్దేశం. అలాగే రాబోయే 10 ఏళ్లలో నన్ను నేను నా కోసమే కథలు రాసుకునే దర్శక రచయితలతో పనిచేయాలి అనుకుంటున్నాను. ఒక పాత్ర రాసుకుని దీనికి రాగ మయూర్ మాత్రమే కావాలి అనుకునే స్థాయికి వెళ్లాలని నా ఫీలింగ్.

ఆల్ ది బెస్ట్ కంగ్రాట్యులేషన్స్ రాజ్ మయూర్..
థాంక్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gandhi Tatha Chettu
  • Rag Mayur Exclusive Interview
  • Sivarapalli

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions