బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత సరసమైన ధరకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 11వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ మరియు ఎకనామిక్స్ కాన్‌క్లేవ్ 2024లో సీతారామన్ పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఆమె భారతదేశానికి మొదటి మహిళా ఆర్థిక మంత్రి మాత్రమే కాదు, ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.
పెట్రో ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులకు భారంగా మారిపోయాయి.. క్రమంగా ఆ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతూనే ఉంది.. అయితే, పెట్రోల్, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో.. ఏడేళ్ల క్రితం అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను…