తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు.
పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది.