ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్‌లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్‌లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు…