Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల కల్పనకు ఒక విప్లవాత్మక ముందడుగు పడిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఉత్తరాద్య విధానాల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రానికి వస్తారని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,413…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కులం కుంపటి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్సెస్ కాపుగా మారడం ఆందోళనకరమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే పార్టీ పాత నాయకులు, మారి వచ్చిన వాళ్ళు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. చివరికి మేటర్ ముదిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందట.
ఆదిలాబాద్‌లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో…