తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రారంభమైన సిరివెన్నెల అంతియయాత్రకు సర్వం సిద్ధమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర కొనసాగనుంది. Read Also : సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం జూబ్లీహిల్స్…
ఫిలించాంబర్‌లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి చిత్రపరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు తీరనిది. ఎవరూ కూడా భర్తీ చేయలేనిది అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే, సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవి. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పాను. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పాను. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదు. కిమ్స్ హాస్పిటల్…
వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతోఅందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలనిమన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి…అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు…మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి… రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజాఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు…రేపు రాబోయే” రంగమార్తాండ ” కూడా..సీతారాముడు రాసిన పాటలకు…
ఈరోజు ఉదయం సిరివెన్నెల పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు చేర్చారు. అక్కడ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల పార్థివదేహానికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులు అర్పించారు. గత రెండు సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారితో నాకు అనుబంధం ఉంది. సమాజాం పట్ల చాలా గౌరవం కలిగిన వ్యక్తి. నేను ఈ వారంలోనే ఆయనను కలవాలి అనుకున్నాను. కోవిడ్ సమయంలో పోలీసులు…
అశేష తెలుగు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తూ మరో తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Read Also : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ తాజాగా…
లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. 66 ఏళ్ల గీత రచయిత ఆకస్మిక మరణ వార్త తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల 1984లో జననీ జన్మభూమితో అరంగేట్రం చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున..’ పాటతో కీర్తిని పొందారు. శాస్త్రి దాదాపు 3000 పాటలకు సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్…
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల ఇక లేరన్న విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్…