కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు…