Andhra Pradesh: విజయవాడలోని సింగ్ నగర్ తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
బెజవాడలో వరదలపైనే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాత్రి గంటన్నర సేపు సింగ్ నగర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు.. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు బాధితులు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు వివరించారు వరద బాధితులు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలుపుతూ…
Power Boats In Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ వచ్చాయి. దీంతో బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ కొనసాగుతుంది.
Singh Nagar floods: విజయవాడ నగరంలోని సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించింది. దీని వల్ల సింగ్నగర్ పూర్తిగా నీట మునిగింది. ఇక, సింగ్ నగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.