సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి…
సింగరేణిలో మూడు రోజుల సమ్మె ముగిసింది.భూగర్భ గనులతోపాటు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల్లోని బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ఏరియల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి. 72 గంటలపాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, BMS, CITU లు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు…
సింగరేణిలో సుదీర్ఘకాలం తరువాత సమ్మె సైరన్ మోగింది.నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. మరో 11 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.18 ఏళ్ల తర్వాత అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా…