జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ గనిలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడటంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడనుంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు.
Ponguleti Sudhakar Reddy : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కిష్టారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీలకు కాలుష్యాన్ని వెదజల్లుతున్న సైలో బంకర్‌పై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన కిష్టారం గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ.. కాలుష్యం భారీ నుండి కిష్టారం గ్రామాన్ని రక్షించండన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారని, చనిపోయిన వారి ఫోటోలు చూస్తా ఉంటే చాలా బాధగా ఉందన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఎన్నికల ప్రచారం ఉన్నప్పటికీ .. నా ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో…
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫుర్నేస్ 3లో ముడి సరకు కోసం జరుగుతున్న బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్…
సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.20…
సింగరేణిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి… తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు…
దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం…