Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Pakistan: పాకిస్తాన్‌లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.
పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. అయితే అధికారులు ఆమెను కాపాడారు. గత వారం మిర్‌పూర్ ఖాస్‌లోని కోట్ గులామ్ ముహమ్మద్ గ్రామంలోని ఇంటి బయటికి వెళ్లిన 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. సిర్‌హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారు. బాలికను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారు. అనంతరం షాహిద్ తల్పూర్‌తో వివాహం జరిపించారు. అయితే.. హిందూ మైనారిటీలో…
Family Murder: ఒక అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో తన కుటుంబానికి చెందిన 13 మందిని చంపిన బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఇష్టానుసారం పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేకపోవడంతో అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి…
Pakistan: 15 రోజుల వయసున్న నవజాత శిశువును బ్రతికి ఉండగానే ఓ తండ్రి ఖననం చేశాడు. బిడ్డ ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చింది.
Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ధాటికి 8 మంది మరణించారు. రాకెట్ లాంచర్ మందుగుండుతో పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్సులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
20 Killed After Bus Falls Into Water-Logged Ditch In Pakistan's Sindh: పాకిస్తాన్ దేశంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్ సింధు ప్రావిన్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నీటి గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. 14 మంది గాయపడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారీ వరదల్లో పాకిస్తాన్ లోని రహదారులు కొట్టుకుపోయాయి. ఈ…
Hindu girl forcibly converted to Islam sent to safe home by court after social media outrage: పాకిస్తాన్ దేశంలో ఇటీవల వరసగా హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపుకు గురవుతున్నారు. సింధు ప్రావిన్సులో గత నెల ఇద్దరు బాలికలు కిడ్నాప్ కాగా.. పెళ్లయిన యువతిని కూడా ఇలాగే కిడ్నాప్ చేశారు. ఇటీవల కొన్ని వారం రోజుల క్రితం 14 ఏళ్ల బాలికను, ఈ వారంలో మరో ఇద్దరు బాలికను ఇలాగే కిడ్నాప్ చేశారు.…
Pak's Sindh govt orders high-level probe as abducted Hindu girl: పాకిస్తాన్ లో ఇటీవల కిడ్నాపుకు గురైన 14 ఏళ్ల హిందూ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. దీంతో పాకిస్తాన్ సింధు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరంలోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సింధ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Hindu girl abducted in Pakistan's Sindh, fourth incident in 15 days: పాకిస్తాన్ దేశంలో హిందూ బాలికలు, యువతుల కిడ్నాపులు, పెళ్లిళ్లు చేసుకుని బలవంతపు మతమార్పులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ బాలిక కిడ్నాపుకు గురైంది. గత 15 రోజుల్లో ఇది నాలుగో ఘటన. పాకిస్తాన్ జనాభాలో 3.5 శాతం మాత్రమే ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారు. వీరంతా బలవంతపు మతమార్పిడులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బలవంతపు మతమార్పుడులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును…