బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి తండ్రి లానే సకల కళావల్లభుడు అని పించుకున్నాడు శింబు. తండ్రి టి. రాజేందర్ అంత కాకపోయినా… కొన్ని శాఖలలో అయిన శింబు తన ప్రావీణ్యం బయటపెడుతూ ఉంటాడు. తాజాగా శింబు ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో ఇన్ వాల్వ్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా ఎ. కె. ప్రియన్ ను పరిచయం చేస్తూ, యువన్ శంకర్ రాజా తన యు1 రికార్డ్స్ బ్యానర్ లో మిత్రులతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నాడు. దీని కోసం విఘ్నేష్ రామకృష్ణన్ రాసిన పాటను, శింబుతో పాడిస్తున్నారు.
Read Also : ‘కన్నుగీటు పిల్ల’ కవ్వింపు మామూలుగా లేదుగా!?
ఇటీవల యువన్ శంకర్ రాజా కొన్ని ఫోటోలను జత పర్చి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు. తన కోరిక మేరకు సోదరుడు శింబు ఈ పాటను పాడుతున్నాడని చెప్పాడు. దీనిని కాళిదాస్, మేఘా ఆకాశ్ పై డోంగ్లీ జుంబో డైరెక్షన్ లో పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు ‘తప్పు పనితెన్’ అనే పేరు ఖరారు చేసినట్టు యువన్ శంకర్ రాజా ఈ రోజు తెలిపాడు. దీని అర్థం ‘తప్పు చేశాను’ అని. సో… ఈ పాటను పాడించడం ద్వారా శింబుతో ‘తప్పు చేశాను’ అని యువన్ శంకర్ రాజా చెప్పించబోతున్నాడన్న మాట!