అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. దీంతో 132 ఏళ్ల రికార్డ్ బద్ధలైంది. వాగులు, వంకలు అన్ని ఏకమయ్యాయి.
అస్సాం వరదలు ఆ రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల వల్ల 173 మరణించారు. ఒక్క శుక్రవారమే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కాచార్ జిల్లాలో ఆరుగురు, నాగోన్ జిల్లాలో ముగ్గురు, బార్ పేటలో ఇద్దరు, కరీంగంజ్, కోక్రాజార్, లఖింపూర్ లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది వరద…