కామెడీ చేయడం కష్టం అంటోంది సమంత. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) లో ఉత్తమ నటిగా (తెలుగు) అవార్డు అందుకున్న తర్వాత సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఈ సినిమా ఎందుకు చేయాలనుకున్నానంటే కామెడీ నాకు కొత్త. అందుకే ప్రయత్నించాలని అనుకున్నాను. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు నేను చాలా సరదాగా గడిపాను. కామెడీ చాలా కష్టం అని గ్రహించాను. షూటింగ్ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో దాన్ని బట్టి సినిమా విజయాన్ని…
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా పలువురు సినీ స్టార్స్…
సైమా 2021 అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నుండి ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. ఇతర అవార్డుల విషయానికి వస్తే నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్ర…
(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్…