ప్రస్తుతం అనేకమంది ట్రెండ్ కు తగ్గట్టుగా., అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు, అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాలవల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల జుట్టు తొందరగా తెల్లబడడం ద్వారా అనేకమంది జుట్టు నల్లగా కనిపించేందుకు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. ఇంకొందరు ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల వైవిధ్యమైన రంగులను జుట్టుకు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల ఇతరులకు చూడడానికి బాగానే కనిపిస్తున్న కానీ., తరచూ అలా చేయడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
US: జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
అయితే ఇలా హెయిర్ కలర్ వేసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.. అవి ఎలా ఇబ్బంది పడతాయో ఒకసారి చూద్దాం.. ముందుగా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల వెంట్రుకలలోని నాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది. అంతేకాకుండా హెయిర్ కలర్స్ ఎక్కువగా వేసుకోవడం ద్వారా జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయి. ఇందువల్ల జుట్టు పెలుసుగా మారి ఊడిపోతుంది. దీంతో బట్టతల వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమస్యలు పక్కన పెడితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే అన్ని రకాల హెయిర్ కలర్స్ లో కెమికల్స్ కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇందులో చాలామందికి కొన్ని కెమికల్స్ పడవు. అలాంటి వాటివల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం లేదా అలర్జీ లాంటి లక్షణాలు కనబడతాయి.
Pune Car Crash: బాధిత కుటుంబాలు దు:ఖంలో.. నిందితుడికేమో రాచమర్యాదలు
అలాగే కొన్ని రకాల హెయిర్ కలర్స్ లో అమ్మోనియా అనే కెమికల్ వాడటం వల్ల శ్వాస తీసుకోవడంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎక్కువకాలం హెయిర్ కలర్స్ ను వేసుకోవడం ద్వారా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు దగ్గరయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి మనం తినే తిండి, అలాగే వెంట్రుకలకు వేసుకునే హెయిర్ కలర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.