MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమ�
జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
Belagavi: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటి) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు సీఎం పదవి ర�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి.
DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.