DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మలుపులు తిరుగుతోంది. 2023 ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం, 2.5 ఏళ్ల తర్వాత తనకు సీఎం పోస్ట్ ఇవ్వాలని డీకే శివకుమార్ కోరుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు కూడా తానే సీఎంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుతం కాంగ్రెస్ హై కమాండ్ ముందు ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలు తమ నేతలే సీఎంగా ఉండాలని భావిస్తున్నాయి. ఢిల్లీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
Read Also: DMV Vehicle: రోడ్డుపై బస్సులాగా.. ట్రాక్‌లపై రైలులాగా.. 15 సెకన్లలో మోడ్ మారే వెహికల్(వీడియో)
ఇదిలా ఉంటే, తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను హైకమాండ్‌ను కలవడం లేదని, ఢిల్లీకి తనను ఎవరూ పిలువలేదని ఆయన అన్నారు. తాను ఒక కార్యక్రమం కోసం ముంబై వెళ్తున్నట్లు చెప్పారు. ఈ రాత్రికి మళ్లీ బెంగళూర్ తిరిగి వస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వచ్చిన వార్తలను డీకే శివకుమార్ తోసిపుచ్చారు. ఇటీవల, నాయకత్వ మార్పు విషయంలో డీకేను అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు వార్తలు వచ్చాయి. వీటిన్నింటిని ఒక్క స్టేట్మెంట్‌తో డీకే అవాస్తమని చెప్పారు.
Bengaluru | Amid leadership row in the state, Karnataka Deputy CM DK Shivakumar says, "No one has called me (to Delhi) yet. I will be here tomorrow as well. Today, I am going to Mumbai for a private event, and I will be back by tonight." pic.twitter.com/uCjT2TSi0H
— ANI (@ANI) November 27, 2025