గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా చేసిన అశ్లీల నృత్యాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా కరప ఎస్సై రమేష్ బాబుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కూరాడలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్బంగా అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వ్యవహారం రచ్చరేపింది. ముందస్తు సమాచారం రాబట్టడంలో విఫలం కావడంతో ఎస్సై పై చర్యలు తీసుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కార్యక్రమ నిర్వాహకులపై క్రిమినల్…
దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా…
హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎస్సై బీ.సైదులును సస్పెండ్ చేసినట్లు రాచకొండి కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పలు కేసుల విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తేలడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలీసులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పు చేస్తే ఎవ్వరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.