పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ను పూర్తి చేసి, ఇప్పుడు ‘ఆదిపురుష్, సలార్’ చిత్రాల చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ‘రాధేశ్యామ్’ను తెలుగు యువకుడు ‘జిల్’ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుంటే, ‘ఆదిపురుష్’ను హిందీ దర్శకుడు ఓంరౌత్, ‘సలార్’ను కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సో… ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ ను మూడు భాషలకు చెందిన దర్శకులు హ్యాండిల్ చేస్తున్నారు. Read Also : ఈ మలయాళ హీరోకు…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ‘అఖండ’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా గోపీచంద్ ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో…
హాట్ బ్యూటీ శృతి హాసన్ ఈ లాక్ డౌన్ ను ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది శృతి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా… వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదు అంటూ ప్రేమ…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, పాపులర్ సౌత్ హీరోయిన్ శృతి హాసన్ సినీ ఇండస్ట్రీలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా శృతి ట్విట్టర్‌లో #AskMeAnything సెషన్‌లో పాల్గొని, ఆమె అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శృతి చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొనడంతో నెటిజన్లు…