యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీవీషో లలో చూసినా అమ్మడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ తాజాగా చిక్కినట్లు కనిపిస్తోంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామపై తాజాగా ట్రోలర్స్ విరుచుకు పడ్డారు.…