School Bus Fire: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేరు. పోలీసుల సమాచారం ప్రకారం.. బస్సు డ్రైవర్ విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి, బస్సును ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. కొద్ది సేపటికే బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించాడు. అప్పటికే మంటలు చెలరేగాయి. స్థానికులు…
Indore: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని జూన్ థానా పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, కుటుంబంలోని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. శహజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అదే ఇంట్లో అతను ఒక చిన్న గోదాం కూడా ఏర్పాటు చేసుకున్నాడు.…
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
Fire Accident : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద గల సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి…