తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో…