అశోక్ సెల్వన్ కథానాయకుడిగా రీతూ వర్మ – అపర్ణ బాలమురళి .. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశం’. అయితే ఈ సినిమా విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఊపిరే హాయిగా .. మారెనే పదాలుగా, ఊహాలే తీయగా .. మారెనే నిజాలుగా’ అంటూ ఈ పాట సాగే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను హీరోయిన్ సాయిపల్లవి విడుదల చేయించారు మేకర్స్.
Also Read : Thief Pray God: దేవుడా నన్ను క్షమించు.. నీ హుండీని ఎత్తుకెళ్తున్నా..
ఈ పాటను అశోక్ సెల్వన్ – శివాత్మికపై రొమాంటిక్ గా చిత్రీకరించారు. అయితే.. ఈ సినిమాతో అశోక్ సెల్వన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. గోపీసుందర్ అందించిన ట్యూన్ ఆహ్లాదకరంగా సాగింది. అర్థవంతమైన సాహిత్యం, తేలికైన పదాలతో ఈ పాట యూత్‌ను ఆకర్షిస్తోంది. ఫీల్‌గుడ్ తో సాగిన ఆలాపన ఈ పాటకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ముగ్గురు కథానాయికలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.