రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం...
360 Degrees Rotating Shivling in Barsur temple at Chattisgarh: భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా.. శివ భక్తులు మాత్రం భారీ సంఖ్యలో సందర్శిస్తుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం ‘బాబా మహాకాల్’ సమీపంలోని రామేశ్వరాలయంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని, 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే…