Mahashivratri 2025: హైదరాబాద్‌కి దగ్గర్లోని ప్రముఖ శివాలయాలు ఇవే..
- హైదరాబాద్ దగ్గర్లో ప్రముఖ శివాలయాలు
- నగరంలో సైతం పలు పురాతన ఆలయాలు
- ఎక్కడెక్కడ ఉన్నయో చూసేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
కీసరగుట్ట ఆలయం : కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నుండి 40 కి.మీ, ECIL నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకోడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుడిని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు.. అక్కడ ఉన్న 101 లింగాలను చూసి.. ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికీ ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థలపురాణం చెబుతుంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే.. కీసరలో ఎక్కడ చూసినా.. లింగాలే కనిపిస్తాయి.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
చెరువుగట్టు : శ్రీరాముడు ప్రతిష్టించిన చిట్టచివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడిగా చెప్పుకుంటారు. నల్గొండ పట్టణానికి సమీపంలో నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకం. రేపు ఇక్కడ కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం (మెదక్): ఏడుపాయలు పుణ్య క్షేత్రం గురించి తెలంగాణ ప్రాంత ప్రజలు సుపరిచితమే. ఈ ఆలయం హైదరాబాద్‌కు సమీపంలో ఉంటుంది. మెదక్ జిల్లా పరిధిలోని పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మెదక్ నుంచి 14 కి.మి దూరంలో ఉంది. దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు.
ఆలయం ఎదుట పారే మంజీరా నదిలో శివుడి విగ్రహాం ఉంటుంది.
శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం(గౌలిగూడ): భాగ్యనగరంలోని గౌలిగూడ శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథుడి రూపంలో ఉన్న శివుడికి అంకితం చేశారట.
శ్రీ సోమనాథ్ ఆలయం (చార్మినార్ ) : హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో శ్రీ సోమనాథ్ ఆలయం ఉంది. దీని చరిత్ర దాదాపు 500 ఏళ్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. రేపు ఈ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయం(అనంతగిరి) : అనంతర గిరి గురించి పట్నం వాసులకు పెద్దగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే వికారాబాద్ దగ్గరలో అనంతగిరి ఉంది. ఇక్కడ ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి విగ్రహం కలిగిన ప్రముఖ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.
శ్రీ హాటకేశ్వర్ ఆలయం (కార్వాన్): కార్వాన్ లో శ్రీ హాటకేశ్వర్ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.
శ్రీ మహాదేవ్ ఆలయం (ఫిల్ ఖానా): పట్నం నడిబొడ్డున ఓ ప్రముఖ శైవక్షేతం ఉంది. ఇది ఫిల్ ఖానా ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ మహాదేవ్ ఆలయం. ఇక్కడికి కూడా మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి సైతం చరిత్ర ఉంది.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!