360 Degrees Rotating Shivling in Barsur temple at Chattisgarh: భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా.. శివ భక్తులు మాత్రం భారీ సంఖ్యలో సందర్శిస్తుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం ‘బాబా మహాకాల్’ సమీపంలోని రామేశ్వరాలయంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని, 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఇలా 360 డిగ్రీలు తిరిగే శివలింగం మరో చోట కూడా ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బర్సూర్‌లో అద్భుతమైన శివాలయం ఉంది. చారిత్రక నగరం బర్సూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని పిలుస్తారు. ఈ ఆలయం 32 స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. రెండు గర్భాలయాలు కలిగిన ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగంను తిప్పుతూ కోరుకున్న కోర్కెలను ఆ శివయ్య నెరవేరుస్తాడట. రాజమహర్షి గంగామహాదేవి 1208లో ఈ ఆలయాన్ని నిర్మించారట.
Also Read: Adithi-Siddharth Marriage: అదితి-సిద్ధార్థ్ పెళ్లి ఫొటోలు వైరల్!
సాధారణంగా ఏ గుడిలో అయినా శివలింగ నీటి ముఖం ఉత్తర దిశలో ఉంటుంది. కానీ బత్తీస్ మందిర్ ఆలయంలో భక్తులు శివలింగాన్ని ఏ దిశలోనైనా తిప్పుకోవచ్చు. ఇక్కడ శివలింగాన్ని తిప్పుతూ భక్తులు తమ కోరికలను శివుడికి చెప్పుకుంటారు. 360 డిగ్రీలు తిరిగే ఈ శివలింగంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ताजमहल को अजूबा मानने वालों जरा हमारी सनातन संस्कृति पर नजर डालो भगवान शिव को समर्पित 1100 साल पुराना बत्तीसा मंदिर बारसूर ,अनोखी बात यह है कि यहां दोनों गर्भगृहों में स्थापित शिवलिंग 360° में घूमता है..
हर हर महादेव,🙏https://t.co/P6fAKS60MA pic.twitter.com/4OXzq3FsQc— रजनी कांत सिंह (@rajnikantsinghr) September 16, 2024