Milind Deora: పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉంటే, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబంతో యూరప్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారని శివసేన నేత మిలింద్ దేవరా ఘాటు విమర్శలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే యూరప్‌లో హాలీడేస్ గడుపుతున్నారని మండిపడ్డారు.
కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.