చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని…