శాసనమండలి ఆవరణలో ‘రైతు రుణమాఫీ’ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని.. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కనపెట్టారని మధుసూదన చారి మండిపడ్డారు. చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం…
సీఎం రాజకీయ కార్యదర్శిఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి గ్రామంలో హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా రక్తం కొరత ఏర్పడినందున ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దాదాపు నియోజకవర్గంలో మొత్తం ఐదు వేల మొక్కలు నాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం…