Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌కు థాంక్స్..
- ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ పాకిస్తాన్‌కు గట్టిగానే తగిలినట్లు ఉంది. మరోసారి ఈ అంశాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు. కాల్పుల విరమణకు సహకరించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ట్రంప్‌నకు రుణపడి ఉంటుందని అన్నారు. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు. అమెరికా-పాకిస్తాన్ బంధం ప్రత్యేమైందని షరీఫ్ అన్నారు.
‘‘దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన శాంతికి రాయబారిగా గుర్తుండిపోతారు’’ అని అన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తార్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీసింది. పాక్ వైమానిక దళానికి చెందిన పలు ఎయిర్‌బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ యుద్ధం ఆగేందుకు తానే సహకరించినట్లు ట్రంప్ పలుమార్లు చెప్పుకున్నారు. అయితే, దీంట్లో మూడో దేశం జోక్యం లేదని, పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్ స్పష్టం చేసింది.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
మరోవైపు ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించిన షాబాష్ షరీఫ్, అమెరికా విదేశాంగ విధానానికి కొత్త శక్తిని తెచ్చారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, స్థిరత్వం కోసం ట్రంప్ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రాంతీయ శాంతి కోసం తమ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు